జిల్లాలో సామాన్యులకు దూరంగా చికెన్ ధరలు
KNR: రానురాను సామాన్యులకు అందకుండా చికెన్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కార్తీక పౌర్ణమి ముగిసిన నాటి నుంచి చికెన్ ధరలకు రెక్కలు వచ్చాయి. డిసెంబర్ 31 నుంచి చికెన్ ధరలు ఏకంగా కిలో ధర రూ. 300 పలుకుతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా చికెన్ ధర మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో సామాన్య ప్రజలకు చికెన్ దూరమయ్యే పరిస్థితి రానుంది.