9న ఔషధ పరీక్షల ల్యాబ్ ప్రారంభం
విశాఖలో ప్రాంతీయ ఔషధ పరీక్షల ప్రయోగశాలను మంగళవారం ప్రారంభించనున్నారు. విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్) ఆవరణలో నిర్మించిన ఈ ప్రయోగశాలతో పాటు ఔషధ నియంత్రణ, పరిపాలన సంయుక్త సంచాలక కార్యాలయాన్ని ఈనెల 9న జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ ప్రారంభించనున్నారు.