VIDEO: 'అఖిల భారత సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి'
BPT: ఫిబ్రవరి 12న జరిగే అఖిల భారత సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో వేటపాలెం మండల సీఐటీయూ కమిటీ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ తీసుకువచ్చిన లేబర్ కోడ్ బిల్లులను తక్షణమే రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.