'ఫార్మర్ ఐడీ' గుర్తింపు తప్పనిసరి

'ఫార్మర్ ఐడీ' గుర్తింపు తప్పనిసరి

ఖమ్మం: కేంద్రప్రభుత్వం చేపట్టిన 'ఫార్మర్ ఐడీ' ప్రాజెక్టులో భాగంగా ప్రతీ రైతుకు 11 అంకెలతో కూడిన ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించనున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య తెలిపారు. సోమవారం రఘునాథపాలెం మండలం వీ.వీ. పాలెంలో రైతుల వివరాల నమోదును ఆయన పరిశీలించి మాట్లాడారు. కేంద్రప్రభుత్వ పథకాలు పొందేందుకు ఫార్మర్ ఐడీ తప్పనిసరి అన్నారు.