నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన DCC రాజమహేంద్ర నాయక్
WGL: రాయపర్తి మండలంలోని మొత్తం 13 గ్రామ పంచాయతీ నామినేషన్ కేంద్రాలను వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఇవాళ సందర్శించారు. నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా, నిబంధనలకు అనుగుణంగా కొనసాగేందుకు అవసరమైన సూచనలు సిబ్బందికి అందించారు. వీరి వెంట ఏసీపీ అంబటి నరసయ్యతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.