బొమ్మల మేళాలో భాగంగా కొండపల్లి ఖిల్లాపైకి ట్రెక్కింగ్
NTR: కొండపల్లిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన బొమ్మల మేళాలో శనివారం కొండపల్లి ఖిల్లా పైకి మెట్ల మార్గం ద్వారా హెరిటేజ్ ట్రెక్కింగ్ నిర్వహించారు. ఖిల్లాపైకి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ట్రెక్కింగ్ చేశారు. ఖిల్లా రోడ్డు నుంచి మెట్ల మార్గం గుండా అటవీ ప్రాంతంలో ఎత్తయిన కొండను అధిరోహించారు. ప్రకృతిని ఆస్వాదించడానికి ఒక గొప్ప సాహస యాత్ర అన్నారు.