ఎయిడ్స్ నివారణ పై అవగాహన ర్యాలీ
GNTR: ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం ఫిరంగిపురం దీనాపూర్ క్యాంపస్‌లోని R C J C , St. Xavier ఫార్మసీ కళాశాల విద్యార్థులు ఎయిడ్స్ వ్యాధి నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. విద్యార్థులు ప్లకార్డులు, నినాదాలు, ర్యాలీల ద్వారా ఎయిడ్స్ నివారణ ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈక్రమంలో ఫిరంగిపురం సెంటర్లో మానవహారం నిర్వహించారు.