రెండుకు చేరిన రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య

రెండుకు చేరిన రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య

MDK: రామాయంపేట మండలం అక్కన్నపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. ఆటోలో ప్రయాణిస్తున్న కామారెడ్డి జిల్లా బస్వాపూర్ గ్రామానికి చెందిన మంజుల అక్కడికక్కడే మృతిచెందగా.. భర్త బాలరాజు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కుమారుడు, కుమార్తెకు గాయాలు కాగా చికిత్స పొందుతున్నారు.