చైనాలో భారత రాయబారిగా విక్రమ్ దోరైస్వామి

చైనాలో భారత రాయబారిగా విక్రమ్ దోరైస్వామి

సీనియర్ దౌత్యవేత్త విక్రమ్ దోరైస్వామి చైనాలో భారత నూతన రాయబారిగా నియమితులయ్యారు. 1992 బ్యాచ్ IFS అధికారి అయిన ఆయన, ప్రస్తుతం యూకేలో భారత హైకమిషనర్‌గా పనిచేస్తున్నారు. ప్రదీప్ కుమార్ రావత్ స్థానంలో ఆయన ఈ కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.