'వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

'వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

AKP: వర్షాలు పడుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోటవురట్ల మండల ఎంపీడీవో చంద్రశేఖర్ హెచ్చరించారు. బుధవారం ఎండపల్లిలో పంచాయతీ కార్మికులతో గ్రామాన్ని పరిశుభ్రం చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరిశుభ్రతతోనే ఆరోగ్య కరమైన వాతావరణ ఏర్పడుతుందన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.