'గాలికుంటు వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి'

'గాలికుంటు వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి'

AKP: పశువులకు సోకే గాలికుంటు వ్యాధి పట్ల పాడి రైతులు అప్రమత్తంగా ఉండాలని కోటవురట్ల పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ లక్ష్మీనారాయణ సూచించారు. సోమవారం కోటవురట్ల, మాకవరపాలెం మండలాల్లో ఈ వ్యాధి రాకుండా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సోమవారం చేపట్టామన్నారు. వచ్చేనెల 15 వరకు కొనసాగుతుందని తెలిపారు. పాడి రైతుల ఇంటికి వెళ్లి సిబ్బంది వ్యాక్సినేషన్ వేస్తున్నట్లు పేర్కొన్నారు.