శశిథరూర్ కాన్వాయ్‌పై దాడి
కేరళంలోని మలప్పురంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కాన్వాయ్‌పై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఎంపీ ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డగించిన నిందితులు.. ఆయన డ్రైవర్, గన్‌మెన్‌పై భౌతిక దాడికి దిగారు. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శశిథరూర్ సురక్షితంగా ఉన్నారని తెలిపారు.