UNI న్యూస్ ఏజెన్సీ ఆఫీసు సీజ్
ఢిల్లీలోని యూనైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా వార్త ఏజెన్సీ(UNI) ఆఫీసును అధికారులు సీజ్ చేశారు. పారామిలిటరీ దళాలు, ఢిల్లీ పోలీసుల ఆధ్వర్యంలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ఆఫీసులో ఉన్న 50 మంది జర్నలిస్టులను బయటకు పంపించారు. భూ వివాదం నేపథ్యంలో కోర్టు ఆదేశాల ప్రకారం UNI ఆఫీసును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని UNI ఆరోపించింది.