VIDEO: ఉరి వేసుకున్న బోడే రామచంద్రయాదవ్ సెక్యూరిటీ గార్డ్
CTR: పుంగనూరులో విషాదం నెలకొంది. బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్రయాదవ్ వద్ద జవాన్ చిన్నారెడ్డి వై ప్లస్ సెక్యూరిటీగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం డ్యూటీ ముగించుకుని తన గదిలో వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ సుబ్బరాయుడు, సిబ్బంది చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.