CMRF చెక్కును అందజేసిన TGIDC చైర్మన్
KMM: సత్తుపల్లి మండలంలోని యతలకుంటకి చెందిన వల్లెపు లక్ష్మికి టీజీఐడీసీ ఛైర్మన్ మువ్వా విజయబాబు గురువారం రూ.52 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.