ఆచంటలో ఈనెల 24న గ్రామ సభలు
W.G: ఈ నెల 24న మండలంలోని అన్ని గ్రామపంచాయతీలలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గ్రామ సభలు నిర్వహించాలని ఆచంట ఎంపీడీవో బి. కృష్ణమోహన్ కార్యదర్శులను ఆదేశించారు. గురువారం కార్యాలయంలో కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్ మూడు అంచెల వ్యవస్థ ద్వారా అందుతున్న సేవలు ప్రజలకు వివరించాలని అన్నారు.