నరసరావుపేటకు రానున్న మంత్రి నాదెండ్ల

నరసరావుపేటకు రానున్న మంత్రి నాదెండ్ల

PLD: నరసరావుపేటలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటిస్తారని జనసేన ఇంఛార్జ్ జిలాని తెలిపారు. ఆగస్టు 15 సందర్భంగా శుక్రవారం పల్నాడు జిల్లా కలెక్టరేట్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. జనసేన ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తామన్నారు. జన సైనికులు, వీర మహిళలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.