'సినీ నటుడు ప్రకాష్ రాజ్‌పై చర్యలు తీసుకోవాలి'

'సినీ నటుడు ప్రకాష్ రాజ్‌పై చర్యలు తీసుకోవాలి'

SRD: కేరళం రాష్ట్రంలో జరిగిన కేరళం లిటరేచర్ ఫెస్టివల్ (KLF)లో తమ కులదైవమైన శ్రీరాముడిని కించపరిచేలా మాట్లాడిన సినీ నటుడు ప్రకాష్ రాజ్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా సగర సంగం ప్రచార కమిటీ అధ్యక్షుడు కంగ్టి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం సిర్గాపూర్ పోలీస్ స్టేషన్లో ప్రకాష్ రాజ్‌పై ఫిర్యాదు చేశారు. ఆయనపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలన్నారు.