VIDEO: 'ధర్నా చేస్తేనే యూరియా ఇస్తారా'

VIDEO: 'ధర్నా చేస్తేనే యూరియా ఇస్తారా'

CTR: బైరెడ్డిపల్లి మండల కేంద్రంలో రైతు సేవా కేంద్రం ఎదుట యూరియా కోసం రైతులు రహదారిపై ధర్నా నిర్వహించారు. వారం రోజుల నుంచి తిండీ తిప్పలు లేకుండా తిరుగుతుంటే మధ్యాహ్నం 12 గంటలు అవుతున్నా ఒక్కరు కూడా రాలేదని, ఆఫీసుకు తాళం వేసి ఉందని తెలియజేశారు. పోలీసులు వచ్చి సంబంధిత అధికారులకు ఫోన్ చేయగా వచ్చి యూరియాను సప్లై చేశారు. దీంతో ధర్నా చేస్తేనే యూరియా ఇస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు.