విషాదం.. జంపన్నవాగులో భక్తుడు మృతి
MLG: తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర తొలి రోజే విషాద ఘటన చోటుచేసుకుంది. జనవరి 28న పవిత్ర జంపన్నవాగులో పుణ్యస్నానం కోసం దిగిన మంచిర్యాల జిల్లాకు చెందిన కిరణ్ (45) నీటి ప్రవాహంలో చిక్కుకుని మృతి చెందాడు. ఈ ఘటన జాతరకు వచ్చిన భక్తుల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది.