VIDEO: రేపటి నుంచే..!
తిరుమలలోని పెట్రోల్ బంకుల్లో 'నో హెల్మెట్ - నో పెట్రోల్' నిబంధనను సోమవారం నుంచి అమలు చేయనున్నారు. ఈ మేరకు బంకుల వద్ద ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో బ్యానర్లు ఏర్పాటు చేశారు. తిరుమలకు వచ్చే భక్తులు, స్థానికులు వాహనాలకు పెట్రోల్ పట్టుకునే సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అవగాహన కల్పిస్తున్నారు.