'ఉచిత విద్యుత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

'ఉచిత విద్యుత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

కృష్ణా: చేనేత కార్మికులు ఉచిత విద్యుత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా చేనేత జౌళి శాఖ అభివృద్ధి అధికారి ఆర్. రాజు కోరారు. బుధవారం చల్లపల్లిలోని చేనేత సొసైటీలో చేనేత లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మగ్గం ఉన్న ప్రతి ఒక్క చేనేత కార్మికుని ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు లభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు మధు, ప్రకాష్ పాల్గొన్నారు.