అనధికార లే అవుట్లు తొలగింపు
CTR: పుంగనూరు పట్టణ పరిధిలో అనధికారికంగా ఏర్పాటు చేసిన లేఅవుట్లను తొలగించినట్లు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణంలో ఉన్న లే అవుట్లను సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఎటువంటి అనుమతులు లేకుండా వేసిన లే అవుట్‌లు, నిర్మాణాలపై కఠిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. లే అవుట్‌లు వేయాలంటే అనుమతులు తప్పనిసరిగా ఉండాలన్నారు.