బాలికల గురుకుల ఘటనలో నిందితుడు అరెస్ట్
సత్యసాయి: కదిరిలోని ఎస్టీ బాలికల గురుకుల పాఠశాలలో అక్రమంగా ప్రవేశించి విద్యార్థినులను భయాందోళనకు గురి చేసిన నిందితుడు మహేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కుమ్మరోళ్లపల్లి గ్రామానికి చెందిన మహేష్ ఈనెల 4న రాత్రి హాస్టల్ గోడ దూకి లోపలికి ప్రవేశించి సెక్యూరిటీ గార్డును, బాలికలను బెదిరించి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇవాళ అతన్ని పట్టుకున్నారు.