ఫ్లైఓవర్ పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్

ఫ్లైఓవర్ పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్

W.G: జాతీయ రహదారుల నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై కలెక్టర్ నాగరాణి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోతుంటే మీకు పట్టదా? అని అధికారులను నిలదీశారు. తణుకు ఫ్లైఓవర్, సర్వీస్ రోడ్డు పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్లను తొలగించి, కొత్త వారిని నియమించైనా సరే పనులను వేగవంతం చేయాలన్నారు.