కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఎక్కుతూ జారిపడి వ్యక్తి మృతి

కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఎక్కుతూ జారిపడి వ్యక్తి మృతి

వరంగల్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారం నంబర్-1 పై ఖమ్మం వైపు వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఎక్కబోతూ గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. శరీరం నడుము వద్ద తెగి రెండు ముక్కలైంది. మృతుడు తెలుపు, లేత నీలిరంగు చారల షర్ట్ ధరించి ఉన్నాడు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు.