దివ్యాంగుల రాష్ట్ర పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం
MLG: డిసెంబర్ 3 అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవాలని MLG జిల్లా సంక్షేమ అధికారి తల రవి పిలుపునిచ్చారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. జిల్లా దివ్యాంగులు ఈ నెల 19వ తేదీలోపు వివిధ కేటగిరీల పురస్కారాలకు దరఖాస్తు చేయవచ్చని తెలిపారు. వివరాలకు https://wdsc.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.