VIDEO: భక్తులతో కిక్కిరిసిన వాడపల్లి ఆలయం
కోనసీమ: జిల్లా ఆత్రేయపురం మండలం పరిధిలోని వాడపల్లిలో ఉన్న ప్రసిద్ధ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి శనివారం ఉదయం భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో స్వామివారి ఆలయంలో క్యూలైన్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. అయితే అధికారులు వేకువజాము నుంచే భక్తులకు దర్శనాలు కల్పించారు. భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున, తగిన ఏర్పాట్లు చేశారు.