జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌కు స్వల్ప అస్వస్థత

జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌కు స్వల్ప అస్వస్థత

E.G: రాజమండ్రి పర్యటనలో ఉన్న జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కిషోర్ మక్వానా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఆయనకు గుండెలో నొప్పి రావడంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు ప్రాథమిక చికిత్స అందించి, ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం.