జనవరిలో అనకాపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం

జనవరిలో అనకాపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం

AKP: ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్న అనకాపల్లి రైల్వే స్టేషన్‌ను వచ్చే జనవరి నెలలో ప్రారంభించనున్నట్లు ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మాట్లాడుతూ.. ఎంపీ నియోజకవర్గం పరిధిలో పెండింగ్లో ఉన్న రైల్వే పనులను ఏడాదిలోగా పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. పనులకు అడ్డంకులు లేకుండా క్లియరెన్స్ కోసం అధికారులు బృందంగా ఏర్పడాలని సూచించారు.