నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

E.G: రాజమండ్రిలోని గౌతమీ సబ్ స్టేషన్లో నూతన లైన్ నిర్మాణం పని నిమిత్తం ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎలక్ట్రికల్ ఈఈ నక్కపల్లి శామ్యూల్ తెలిపారు. ఈ కారణంగా ఆల్కాట్ గార్డెన్స్, కన్నాంబ వీధి, కాలేశ్వరం టెంపుల్, గోదావరి బండ్, పోస్టాఫీసు వీధి, ఆశ్రమం వీధి, తదితర ప్రాంతాల్లో సరఫరా ఉండదన్నారు.