కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ

కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ

తిరుపతి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆర్జిదారుల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలను సంబంధిత శాఖలకు పంపించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, జిల్లా రెవెన్యూ అధికారి జీ. నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కార్యక్రమంలో పాల్గోన్నారు.