'అధిష్టానం చెబితే సీఎం కుర్చీ నుంచి దిగిపోతా'
ఉగాది తర్వాత కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పీఠాన్ని వదలాలని పార్టీ అధిష్టానం చెప్తే తనకేమీ అభ్యంతరం లేదని.. తప్పుకుంటానని వెల్లడించారు. వారి నిర్ణయానికి తాను అన్ని సమయాల్లోనూ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.