'ఆశా వర్కర్లకు రూ.26 వేల వేతనం ఇవ్వాలి'
GNTR: ఆశా దినోత్సవం సందర్భంగా సీఐటీయూ నాయకులు మంగళవారం దుగ్గిరాల, ఈమని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి ఆశా వర్కర్ల సమస్యలు తెలుసుకున్నారు. సీఐటీయూ మండల ఉపాధ్యక్షుడు జెట్టి బాలరాజు మాట్లాడుతూ.. ఆశా వర్కర్లకు నెలకు రూ.10,000 మాత్రమే ఇస్తున్నారని, వారికి కనీస వేతనంగా రూ.26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు.