'పేదలకు సీఎం సహాయనిధి ఒక వరం'

'పేదలకు సీఎం సహాయనిధి ఒక వరం'

MDCL: కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన సాజిదా బేగం, అశోక్ యాదవ్, ఎస్. దీపలకు సీఎం సహాయనిధి (CMRF) ద్వారా ఒక్కొక్కరికి రూ. 60,000 ఆర్థిక సాయం అందింది. కాంగ్రెస్ నాయకుడు కిషోర్ రెడ్డి చొరవతో ఈ నిధులు మంజూరయ్యాయి. 294 డివిజన్ కార్యాలయంలో బాధితులకు ఆయన చెక్కులు అందజేశారు. పేదలకు సీఎం సహాయనిధి ఒక వరమని కిషోర్ రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.