'పుష్కర ఘాట్ల రోడ్లు గడువులోగా పూర్తిచేయాలి'
PDPL: పుష్కరాల ఘాట్లకు వెళ్లే రహదారులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆర్&బి, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖలతో సమీక్ష నిర్వహించారు. మంథని, గోలివాడ ఘాట్ల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని సూచించారు. భారీగా భక్తులు వచ్చే అవకాశముండటంతో శాశ్వత సదుపాయాలు కల్పించాలని తెలిపారు.