VIDEO: పూలకు ధర లేక.. రోడ్డుపై పారబోత

KDP: ఖాజీపేట ప్రాంతంలోని దుంపలగుట్ట, చెముళ్లపల్లె, పాటిమీద పల్లెలో రైతులు పూలను సాగు చేస్తుంటారు. కనకాంబరం, తెల్ల చామంతి, బంతి, తదితర రకాల పూలను ఎక్కువగా సాగు చేసేవారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ధరలు ఆశాజనకంగా లేవని రైతులు మదన పడుతున్నారు. బంతి పువ్వు కిలో రూ. 10 కూడా అడిగే వారు లేరని రైతులు పేర్కొన్నారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో రోడ్డుపై పూలను పడేశారు.