వరంగల్ కోటను సందర్శించిన విదేశీ ప్రతినిధులు
WGL: ఖిలా వరంగల్ కోటను శనివారం 27 దేశాలకు చెందిన 30 మంది ప్రతినిధులు సందర్శించారు. కాకతీయ రాజుల చరిత్ర, నిర్మించిన కోటల వివరాలను గైడ్ రవి యాదవ్ ప్రతినిధులకు వివరించారు అనంతరం రాతికోట, ఏకశిలా నగరం, కుసుమహల్ ప్రాంతాన్ని తిలకించారు. కోట అందాలను తిలకించి విదేశీ ప్రతినిధులు పులకించిపోయారు.