వాహన తనిఖీలు
PDPL: జిల్లాలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కమాన్పూర్ ఎస్సై కొట్టే ప్రసాద్ సిబ్బందితో కలిసి నిన్న వాహన తనిఖీలు నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భద్రత చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు చేపట్టగా, అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలు చట్టాలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ఆయన సూచించారు.