'కొత్త పాస్‌పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయి'

BPT: రాష్ట్రంలో 21 లక్షల కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయని రేపల్లె MLA , మంత్రి అనగాని సత్యప్రసాద్ శనివారం తెలిపారు. తప్పులు లేకుండా వాటిని రైతులకు అందజేస్తామన్నారు. పాసుపుస్తకాలు ఇచ్చే ముందు మరోసారి పరిశీలిస్తున్నామన్నారు. రెవెన్యూ సదస్సుల ద్వారా అనేక భూ సమస్యలను పరిష్కరించామని, పాస్‌పుస్తకాలు లేకుండా కూడా రైతులు రుణాలు పొందవచ్చన్నారు.