VIDEO: ఓటు హక్కును వినియోగించుకున్న సినీ హీరో గోపీచంద్
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా శ్రీనగర్ కాలనీలోని మహిళా సమాజం పోలింగ్ కేంద్రంలో సినీ నటుడు గోపీచంద్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాదాసీదాగా పోలింగ్ కేంద్రానికి చేరుకుని తన ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ఓటు వేయాలని ఆయన ఈ సందర్భంగా ఓటర్లకు పిలుపునిచ్చారు.