అమృత్ భారత్ పనులను పర్యవేక్షించిన రైల్వే అధికారులు
VZM: కొత్తవలస రైల్వే స్టేషన్ అమృత్ భారత్ పథకంలో చేర్చడంతో స్టేషన్‌లో జరుగుతున్న పనులను రైల్వే అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం కొత్తవలస రైల్వే స్టేషన్‌ను వాల్తేరు చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అంకుష్ గుప్తా, చీఫ్ ఇంజనీర్ విష్ణుమూర్తితో కలసి తనిఖీలు చేశారు. పనులను సకాలంలో పూర్తి చేయాలని, పనులలో నాణ్యత ప్రమాణాలను పాటించాలని అధికారులు సూచించారు.