VIDEO: ఎర్రజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: ఎమ్మెల్యే

VIDEO: ఎర్రజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: ఎమ్మెల్యే

NZB: ఆర్మూర్ రైతుల, నియోజకవర్గ అభివృద్ధి కోసం అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి గళం విప్పారు. దళారుల చేతిలో నష్టపోతున్న ఎర్రజొన్న రైతులకు రూ.500 బోనస్ ఇవ్వడంతో పాటు, ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్న రోడ్ల నిర్మాణం, పెండింగ్‌లో ఉన్న బీసీ, ఎస్సీ హాస్టళ్ల మంజూరుపై ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలని తెలిపారు.