VIDEO: పాకాల బీచ్‌లో పర్యాటకుల సందడి
ప్రకాశం: సింగరాయకొండ మండలంలోని పాకల బీచ్లో కార్తీక మాసం ఆదివారం సెలవు కావడంతో పర్యాటకులు సందడి చేశారు. జిల్లాలోని నలుమూలల నుంచి బీచు పర్యాటకులు తరలివచ్చారు. సముద్ర కెరటాల్లో స్నానాలు చేసి ఆనందంగా గడిపారు. తుఫాన్ కారణంగా ఇటీవల కురుస్తున్న వర్షాలకు తీరం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మెరైన్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.