షీ టీం కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ
BDK: చుంచుపల్లి షీ టీమ్స్, AHTU కార్యాలయాలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఇవాళ సందర్శించారు. ముందుగా AHTU కార్యాలయ పరిసరాలను పరిశీలించారు. మహిళలపై లైంగిక వేధింపులు, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, ఇతర ఇబ్బందులు ఎదుర్కునే మహిళలు జిల్లా షీ టీమ్స్‌ను నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు. మహిళలలపై జరుగుతున్న నేరాలను అడ్డుకుని వారికి న్యాయం చేయాలని సూచించారు.