సత్తా చాటిన జిల్లా విద్యార్థులు
నెల్లూరు: ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశానికి గానూ నిర్వహించిన రెండో విడత జేఈఈ మెయిన్స్ ఫలితాలను సోమవారం విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా మూడు వేల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. జాతీయ స్థాయిలో జరిగిన ఈ పరీక్షల్లో జనరల్ కేటగిరీలో అక్షయ విశిష్ట 561, వేనాటి కుశాల్ రెడ్డి 954, పొదిలి రామ్ చరణ్ 1602, యశ్వంత్ రెడ్డి 1872 ర్యాంకులను సాధించారు.