రెచ్చగొట్టే పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు: డీఎస్పీ
BDK: మణుగూరు పార్టీ కార్యాలయం ఘర్షణపై సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రవీందర్ రెడ్డి హెచ్చరించారు. పార్టీ కార్యాలయం ఘటనపై రెండు పార్టీల మధ్య జరిగిన గొడవ విషయమై కొంతమంది వ్యక్తులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో వీడియోలు, టెక్స్ట్ రూపంలో రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారని అన్నారు.