'అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి'

'అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి'

KRNL: పత్తికొండలో జరిగిన లోక్‌సత్తా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి ఆనందాచారి ఇవాళ మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు. గత ప్రభుత్వం సమస్యను పరిష్కరించకుండా కాలం గడిపిందని విమర్శించారు. ఆస్తుల విక్రయం, న్యాయపరమైన సమస్యల వల్ల బాధితులకు న్యాయం ఆలస్యం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.