భాగ్యనగరంలో అర్ధరాత్రి 'మిషన్ ఛబుత్రా' 

భాగ్యనగరంలో అర్ధరాత్రి 'మిషన్ ఛబుత్రా' 

TG: HYD బాలాపూర్ పోలీసులు అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు 'మిషన్ ఛబుత్రా' పేరుతో తనిఖీలు చేశారు. ఎస్‌ఐలు ప్రసాద్, నవీన్ నేతృత్వంలోని బృందాలు అర్ధరాత్రి వీధుల్లో తిరుగుతున్న యువకులను తనిఖీ చేసి హెచ్చరించాయి. మండీలు, వ్యాపార సంస్థలను నిర్ణీత సమయానికే మూసివేయాలని స్పష్టం చేశారు. స్థానికంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.