విద్యుత్ దీపాలంకరణ ధ్వంసం.. కేసు నమోదు

విద్యుత్ దీపాలంకరణ ధ్వంసం.. కేసు నమోదు

GNTR: పెదకాకాని శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయ దసరా ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ, అమ్మవారి కటౌట్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గత రాత్రి ఈ ఘటన జరగగా, ఆలయ అధికారులు మంగళవారం పెదకాకాని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.